భారత్ మాకు కీలక భాగస్వామి : ఇవాంక ట్రంప్
ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫలప్రదమైన చర్చలు జరిపారని ట్రంప్ కూతురు, ఆయనకు ఉన్నత సలహాదారు ఇవాంక చెప్పారు. ఇరాన్‌పై ఆంక్షలు, 5జీ, దేశభద్రత తదితర అంశాలపై మోదీ-ట్రంప్‌లు చర్చించారని తెలిపిన ఇవాంక, ఇండియా తమకు కీలక వాణిజ్య, భద్రతా భాగస్వామి, మంచి మిత్రదేశమని పేర్కొన్నారు. జీ-20 దేశాల సదస్సుకు జపాన్‌లోని ఒసాకా వెళ్లినప్పుడు గత వారం అక్కడ మోదీ, ట్రంప్ భేటీ అవ్వడం తెలిసిందే. జీ-20 సదస్సు జూన్ 29న ముగిసింది. ఈ సదస్సుపై ఇవాంక మాట్లాడిన ఓ వీడియోను అమెరికా శ్వేతసౌధం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మోదీ, ట్రంప్‌ల భేటీ గురించి కూడా ఇవాంక ఆ వీడియోలో ప్రస్తావించారు.













