భారతీయులకు ధన్యవాదాలు: ఇవాంకా ట్రంప్
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుపై అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. జీఈఎస్ సదస్సులో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నట్లు ఇవాంకా తెలిపారు. హైదరాబాద్‌లో రెండు వారాల క్రితం జరిగిన ఈవెంట్‌పై ఇవాంకా ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన బృందం ఇవాంకా నేతృత్వంలో సదస్సుకు హాజరైంది. ఆ ట్వీట్‌ను సుమారు 1500 మంది భారతీయులు, ఆరువేల మంది విదేశీయులు షేర్ చేశారు. మరో 900 మంది ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లో ఇవాంకా సదస్సు నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హిందీ పదం ధన్యవాద్ అని వాడారు. జీఈఎస్ సదస్సులో సుమారు 1200 మంది చురుకైన వ్యాపారవేత్తలతో సహా తమ దేశానికి చెందిన 350 మంది పాల్గొన్నట్లు ఇవాంకా ఆ ట్వీట్లో తెలిపారు. అద్భుతమైన ఆహ్వానం ఇచ్చిన ప్రధాని మోదీ, భారత దేశ ప్రజలకు థ్యాంక్స్ అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.













