సుష్మాను కలిసిన ఇవాంకా
సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్ సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలుసుకున్నారు. న్యూయార్క్‌లో వార్షిక ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెషన్లో పాల్గొన్నారు. ఇవాంకా, నవంబర్‌లో భారతదేశంలో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ సమ్మిట్ (జిఇఎస్) కు అమెరికా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నది, ఈ రెండు దేశాలలో మహిళల వ్యవస్థాపకత, శ్రామిక అభివృద్ధి గురించి చర్చ జరిగింది. “మహిళల వ్యవస్థాపకత, రాబోయే జిఇఎస్ 2017,కార్మికుల అభివృద్ధికి అమెరికా, భారత్ మద్య గొప్ప చర్చలు జరిగాయి” అని ఇవాంకా సమావేశం అనంతరం ట్వీట్లో పేర్కొంది.













