ప్రధాని మోదీకి ఇవాంకా ట్రంప్ అభినందనలు
లోక్‌సభ ఎన్నికల్లో రెండోసారి ప్రభంజనం సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ దేశాధినేతల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారు, ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ మోదీకి అభినందనలు తెలిపారు. అద్భుతమైన భారత ప్రజలకు ఇక ముందున్నవన్నీ మంచి రోజులే అని ఆమె ట్వీట్ చేశారు. కాగా రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా శుభాకాంక్షలు తెలిపింది. భారత్‌లో జరిగిన ఎన్నికలను మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువుగా అభివర్ణించింది.













