మీడియాకు ఇవాంక క్లాస్ !
ప్రతి ఒక్కరికీ ప్రైవేటు జీవితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం చాలా పెద్ద తప్పని మీడియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు క్లాస్ పీకింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కూతురు మలియాపై ఈ మధ్య మీడియాలో కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. మలియా సిగరెట్ తాగుతున్న పోటోలు, ఓ యువకున్ని ముద్దుపెట్టుకున్న ఫొటోలు అమెరికా పత్రికలు, టీవిల్లో వచ్చాయి. దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ల కుమార్తెలు స్పందించారు. మలియాకు మద్దతుగా నిలిచారు. ఆమెకు ఓ ప్రైవేటు లైఫ్ ఉంటుందని, ఆది మీడియాకు అనసరమని వారు అన్నారు. కొన్ని విషయాల్లో మీడియా హద్దులు దాటడం మంచి పద్దతి కాదన్నారు. మలియా మాజీ అధ్యక్షుని కూతురు, అమె ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు సిటిజన్, అమెకంటూ వ్యక్తిగత జీవితముంటుందని మీడియా అది తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిదని ఇవాంక ట్వీట్ చేశారు.













