సిలీకాన్ వ్యాలీలో కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాస్ఏంజిల్స్లోని సిలీకాన్ వ్యాలీలో పర్యటించారు. టెకీ దిగ్గజాలను కలుసుకున్నారు. సాన్మినా చైర్మన్, సీఈవో జూర్ సోలాను కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ మంత్రి కేటీఆర్ సాన్మినా సీనియర్ మేనేజ్మెంట్తో చర్చించారు. అడోబ్ సిస్టమ్స్ ఈసీవో శంతను నారాయణ్, హవలెట్ ప్యాకర్డ్ సీఈవో కీర్తి మెల్కోట్లను మంత్రి కేటీఆర్ కలుసుకున్నారు. ఇద్దరితోనే అనేక అంశాలపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలంటూ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చి విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస తెలంగాణీయులు కలిసి రావాలని ఆయన కోరారు.













