ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ
ఇరాన్‌కు అగ్ర రాజ్యం అమెరికా కోలుకోలేని దెబ్బ కొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాక్ రాజధాని బగ్దాద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా జరిపిన రాకెట్ దాడిలో ఇరాన్‌కు చెందిన నిఘా విభాగం ఖుద్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సోలెమాన్ హతమయ్యాడు. తామే ఈ దాడికి పాల్పడినట్టు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇరాకీలు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే ఈ దాడిని ఇరాన్ నేతలు తీవ్రంగా ఖండించారు. దీనికి ప్రతికారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనతో మధ్య ఆసియా ప్రాంతంలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ సహా దానికి మద్దతు ఇస్తున్న దేశాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడేందుకు సిద్దం కావొచ్చని భావిస్తున్నారు.













