అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని చైనా, ఫ్రాన్స్ కోరాయి. నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ఇరాన్ దాడిని ఖండించారు. తమపై దాడిచేస్తే తీవ్రమైన ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్ణు హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ప్రమాదకర, నిర్లక్ష్యపు దాడులకు పాల్పడవద్దని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు. ఇరాక్, ఇరాన్‌లోని తమ పౌరులకు సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు నౌకలను పంపుతున్నట్టు పిలిప్పీన్స్ ప్రకటించింది.













