అమెరికా పర్యటనలో రాహుల్
అసహనం, నిరుద్యోగం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ పేర్కొన్నారు. ఈ రెండు సమస్యలు దేశభద్రతకు, అభివృద్ధికి సవాళ్లు విసురుతున్నాయని అన్నారు. రాహుల్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీఏపీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ పలు భేటీల్లో రాహుల్ మాట్లాడుతూ భారత్లో ఉద్యోగాలను సృష్టించడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. ద వాషింగ్టన్ పోస్టు పత్రిక ఎడిటోరియల్ బోర్డుతో రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.













