డొనాల్డ్ ట్రంప్ కు ఎదురు దెబ్బ
అమెరికాకు గట్టి దెబ్బ. మానవతా వస్తువుల విషయంలో ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాల్సిందేనని ట్రంప్ సర్కారును ఐరాస అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. ఉభయ దేశాలు 1955లో చేసుకున్న స్నేహపూర్వక ఒప్పందానికి ఈ ఆంక్షలు తూట్లు పొడుస్తున్నాయని న్యాయమూర్తులంతా ఏకగీవ్రంగా అభిప్రాయపడ్డారు. ఔషధాలు, వైద్య పరికరాలు, ఆహారం, వ్యవసాయోత్పుత్తులు వంటి మానవతా వస్తువులు ఇరాన్‌కు చేరకుండా నిషేధించడం, ఆ దేశ ప్రజల ఆరోగ్యంపైనా, జీవితాలపైనా తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది అని ఐసీజే వ్యాఖ్యానించింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.













