అస్ట్రాలజీలో మరిన్ని పరిశోధనలు చేస్తా – యుఎస్ఎ ఆస్ట్రాలజీ అవార్డు గ్రహీత జెసి
అస్ట్రాలజీలో పేరుగాంచిన, యావత్ సినీరంగానికి, రాజకీయ రంగానికి సుపరిచితుడైన శ్రీ జె సీ గారికి ”ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ (యుఎస్ఎ) వారు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఆస్ట్రాలజీ” ఇచ్చి గౌరవ సత్కారం చేశారు. కేరళలోని కొచ్చిన్‌లో శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయ ప్రాంగ్రణములో గల మల్టీపర్పస్ హాల్‌నందు జరిగిన వివిధ రాష్ట్రాల, దేశాల జ్యోతిష్కుల సమ్మేళనములో ఈ ప్రత్యేక అవార్డును బహుకరించారు. ఇది ఓ అరుదైన సత్కారము. ఈ అవార్డును జ్యోతిష్య పితామహుడు కీ.శే శ్రీ బి.వి.రామన్ కుమార్తె ప్రముఖ జ్యోతిష్య పండితురాలు గాయత్రీదేవి వాసుదేవ్ గారు ఈ అవార్డును బహుకరించారు. అవార్డు గ్రహీత జె.సి ఈ అవార్డును స్వీకరించి, అమ్మవారి ప్రాంగణంలో కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రముఖ దేశ, విదేశ జ్యోతిష్య పండితులు, మీడియా ముందు ఈ అరుదైన సత్కారము జరిగిందనుకు అభినందించి తన అనుభమును, అనుభూతులను తెలుగుటైమ్స్‌తో పంచుకున్నారు.
నా పేరు దుల్లా సుందర్, మా తల్లిగారి పేరు సీతామహాలక్ష్మి, తండ్రిగారి పేరు శ్రీ వెంకటేశ్వర రావ్, మా గురువుగారి పేరు యలమంద, ఓ విశిష్ట ప్రముఖ వేద జ్యోతిష్యుడు నాది స్వగ్రామం గుడివాడ.నాది మద్య తరగతి కుటుంబం., నేను ఎం.ఎ. (ఆస్ట్రాలజీ), ఎం.ఎ (వేదిక్ జ్యోతిష్యం), పలు డిప్లొమా కోర్సులు చేశాను. నేను వాస్తు, జ్యోతిష్యములో పలు కోణాలలో పరిశోధనలు చేస్తున్నందున నన్ను అందరూ జె.సి. (జాతక చక్ర) అని పిలుస్తుంటారు. ముందుగా లైఫ్ టైమ్ అఛీవ్‌వెంట్ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినందుకు ఐఎఎఫ్ (యూఎస్ఎ) వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జ్యోతిష్యంలో ఐకాన్ అయిన శ్రీమతి గాయత్రీదేవి వాసుదేవ్ గారి ద్వారా ఈ అవార్డు బహుకరించినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చి నాపై బాధ్యత ఇంకా పెంచారు. ఇకపై జ్యోతిష్యం, వాస్తులలో మరిన్ని పరిశోధనలు చేసి యూవత్ దేశానికి నా సేవలను అందించగలనని పూర్తిగా విశ్వసిస్తున్నాను. వాస్తు, జ్యోతిష్యం, సాముద్రిక శాస్త్రములలో నేను ఈ దేశానికి ఓ తార్కాణంగా ఉండగలను. సామాన్య ప్రజలకు కూడా నా సేవలు అందుబాటులో వుంటాయి. నా ఫోన్ నెంబరు 986612889. నేను త్వరలో యూట్యూబ్ ఛాన్లోను, వెబ్సైట్ లోను నా ప్రసంగాలను, నా ఆలోచనలను పొందుపరచి యావత్తు ప్రపంచానికీ అందుబాటులో ఉంటాను.













