వీసా కేసు పరిష్కారానికి 10 లక్షల డాలర్లు
హెచ్ 1 బి వర్క్ వీసా ప్రొగ్రామ్‌లో అవకతవలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై దాఖలైన కేసును 10 లక్షల డాలర్లతో ఇన్ఫోసిస్ పరిష్కరించుకోనుంది. ఈ కేసు సెటిల్మెంట్లో భాగంగా న్యూయార్క్ రాష్ర్టానికి 10 లక్షల డాలర్లను చెల్లించేందుకు ఇన్ఫోసిస్ అంగీకరించింది. మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ కేసును పరిష్కరించుకునేందుకు ఇన్ఫోసిస్ ముందుకు రావటం విశేషం. 10 లక్షల డాలర్లతో ఇన్ఫోసిస్ ఈ కేసును సెటిల్ చేసుకునేందుకు ముందుకు వచ్చిందని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్టి ష్నైడర్‌మెన్ చెప్పారు.













