అమెరికన్లకు ఇన్ఫోసిస్ కీలక ప్రకటన
రానున్న రెండేళ్లలో అంటే 2022 నాటికి అమెరికాలో 12వేల మంది స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. వచ్చే అయిదు సంవత్సరాలలో 25 వేల మందిని నియమించుకుంటామని తెలిపింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఐటీ కంపెనీలు మరింత మంది స్థానికులను నియమించుకోవడానికి ప్రాధానత్య ఇస్తున్నాయి. అయిదేళ్లలో ఇరవై ఐదు వేల మందిని అమెరికాలో నియమించుకోవడానికి కట్టుబడి ఉన్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. అమెరికన్లకు రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు ఇవ్వాలని 2017లో తొలుత ఇన్ఫోసిస్ నిర్ణయించింది. ఆ తర్వాత 13 వేల ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు వీటికి అదనంగా మరో 12 వేల మంది తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఎక్స్పీరియన్స్ కలిగిన వృత్తి నిపుణులతోపాటు ప్రముఖ విశ్వవిద్యాయాలు, కళాశాలల నుంచి తాజా పట్టభద్రులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఐటీ కంపెలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగులను తీసుకునే విషయం విదితమే.













