ఆస్ట్రేలియా మిస్ యూనివర్స్గా భారత సంతతి మహిళ
భారత సంతతికి చెందిన ప్రియా సెరావో (26) మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. విక్టోరియా ప్రభుత్వానికి సలహాదారుగా, న్యాయవాదిగా పని చేస్తున్న ఆమె అందాల పోటీలో పాల్గొన్న తొలిసారే విజేతగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా సెరోవా మాట్లాడుతూ ఈ పోటీలో గెలుస్తానని అస్సలు ఊహించలేదని తెలిపారు. ఇందులో పాల్గొనడం ద్వారా వచ్చిన అనుభవం ఇతర పోటీలకు ఉపయోగపడుతుందని భావించినట్లు సెరావో వివరించారు. ఈ పోటీలో గెలుపొందుతాననే నమ్మకం లేకపోవడం వల్ల తన కుటుంబ సభ్యులను తీసుకురాలేదన్న ఆమె విజేతగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.













