జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు
మెక్సికో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడి బిడ్డలకు దూరమైన వారిలో భారత్‌కు చెందిన ఓ మహిళ ఉందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన భావన పటేల్ (33) అనే మహిళ పట్టుబడగా, వికలాంగుడైన ఆమె కొడుకు(5)ను అమెరికా ప్రభుత్వం తల్లి నుంచి వేరుచేసి నిర్భంధ కేంద్రంలో ఉంచిందని తెలిపింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారి పట్ల జోరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారుల పిల్లలను తల్లిదండ్రుల నుంచి అమెరికా వేరుచేయడం తెలిసిందే. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారిలో 200 మంది వరకు భారతీయులు ఉండొచ్చని వార్తలొచ్చినా ఇలా వివరాలు వెల్లడవటం ఇదే తొలిసారి.













