అగ్రరాజ్యంలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?
అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. 2017 కంటే 2018లో మన వారు 4,157 మంది పెరిగారు. అదే సమయంలో అగ్రరాజ్యంలో చదువు కోసం వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్య 26,120 తగ్గింది. చైనా విద్యార్థులు 147 మంది తగ్గారు. అంతర్జాతీయ విద్యార్థులపై అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం 2017, 2018 సంవత్సరాలను పోలుస్తూ తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. భారతీయ విద్యార్థుల సంఖ్య కొద్దిగా పెరిగా వృద్ధి శాతం బాగా పడిపోయిందని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికాలో చాలా మంది భారతీయ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత మూడేళ్ల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) పూర్తయ్యే లోపు హెచ్1బీ వీసా రాకపోవడంతో రెండో పీజీ చదువుతున్నారు. దీంతో విద్యార్థి వీసాపై ఉన్న వారి సం•్యలో స్వల్ప పెరుగుదల ఉందని భావిస్తున్నారు. గత మూడు నాలుగేళ్లుగా భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్‌తోపాటు జర్మనీ, ఐర్లాండ్ తదితర దేశాలను ఎంచుకుంటున్నారని వారు చెబుతున్నారు.













