అమెరికాలో భారత్‌ది రెండోస్థానం!
అమెరికాకు వెళుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే చైనా అగ్రస్థానం ఉంది. అక్కడి భారత విద్యార్థులు చైనా విద్యార్థుల సంఖ్యలో దాదాపు సగంగా ఉన్నట్లు అధికారి ఒకరు వెల్లడించారు. చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. అమెరికాలో చైనా విద్యార్థుల సంఖ్య సుమారు 3 లక్షల 20 వేలుగా ఉండగా, భారత విద్యార్థులు లక్షా అరవై ఆరు వేలుగా ఉన్నట్లు గణాంకాలను ఉటంకిస్తూ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు.కోల్‌కతాలో జరుగుతున్న ఎడ్యుకేషన్ యూఎస్ఏ యూనివర్సిటీ ఫెయిర్-2017కు వందకు పైగా స్థానిక విద్యార్థులు హాజరైనారు. వివిధ అమెరికన్ వర్సిటీ గురించి సంపూర్ణ సమాచారం, అవగాహన, అక్కడ నిర్వహించేకోర్సులు తదితర వివరాలను ఈ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు అందిస్తారు.













