తప్పు చేస్తున్నామని వారికి ముందే తెలుసు : అమెరికా
అమెరికాలో భారత విద్యార్థుల అరెస్టుపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి అభ్యంతర పత్రం (డిమార్షె) జారీ చేయడంపై అమెరికా ప్రభుత్వం స్పందించింది. తాము తప్పు చేస్తున్నామనే విషయం భారతీయ విద్యార్థులకు ముందే తెలుసునని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో అరెస్టయిన విద్యార్థులందరికీ తాము తప్పు చేస్తున్నామనే విషయం ముందే తెలుసు. ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో బోధనా సిబ్బంది కానీ, తరగతులు కానీ లేవని వారికి తెలుసు. అమెరికాలో అక్రమంగా ఉండాలనే ఉద్దేశంతోనే వారు అలా చేశారు అని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న భారత ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టింది.













