అమెరికాలో దారుణ ఘటన…భారత విద్యార్థిని
అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిలువ నీడలేని వ్యక్తిపై జాలి చూపిన ఓ భారతీయ విద్యార్థి తన ప్రాణాలను పోగొట్టుకున్నారడు. సాయం చేశాడన్న కృతజ్ఞత మరిచిన నిరాశ్రయుడు ఆ విద్యార్థిని అత్యంత కిరాతంగా హత్య చేశారు. జార్జియాలో జనవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్‌లోని హరియాణాకు చెందిన 25 ఏళ్ల వివేక్ సైనీ రెండేళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. ఇటీవల ఎంబీఏ పట్టా పొందిన అతడు జార్జియాలోని ఓ స్టోర్‌లో పార్ట్ టైమ్ క్లర్క్‌గా చేరాడు. ఇటీవల స్టోర్ వద్ద అతడికి జులియన్ ఫాల్కెనర్ అనే నిరాశ్రయుడు కన్పించాడు. అతడిని చేరదీసిన వివేక్ రెండు రోజుల పాటు సాయం చేశాడు. చిరుతిళ్లతో పాటు చలి ఎక్కువగా ఉందని వేసుకొనేందుకు తనవద్దనున్న జాకెట్‌ను కూడా ఇచ్చారు.
జనవరి 16న కూడా జూలియన్ స్టోర్ వద్దకు వచ్చాడు. అయితే, అప్పటికే దుకాణం మూసేసి ఇంటికి బయల్దేరిన వివేక్ అతడిని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు. అతడు వినిపించుకోకపోవడంతో పోలీసులకు ఫోన్ చేస్తానని అన్నారు. దీంతో కోపం తెచ్చుకున్న జూలియన్ తన దగగర ఉన్న సుత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా తలపై కొట్టాడు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికే వివేక్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. అతడు మత్తుపదార్థాలకు బానిసై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. వివేక్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.







