అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి
అమెరికాలో కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇండియానా పొలిస్ రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని ఓ భవనం వద్ద నీల్ ఆచార్య మృత దేహం లభ్యమైనట్లుగా కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిప్టన్ ధ్రువీకరించారు. కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్ కోర్సులను నీల్ ఆచార్య అభ్యసిస్తున్నారు. ఆదివారం నుంచి తన కుమారుడు కనిపించడం లేదని నీల్ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య ఎక్స్ వేదికగా వెల్లడించారు. అతడిని గుర్తించడంలో సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చివరిసారిగా ఉబర్ డ్రైవర్ అతడిని క్యాంపస్‌లో విడిచి పెట్టినట్లు తెలిపారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.







