టెక్సాస్‌లో మరో భారత విద్యార్థి మృతి
టెక్సాస్‌లో ఇటీవల భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదల్లో కొట్టుకుపోతున్న భారత విద్యార్థిని షాలిని సింగ్‌ను అక్కడి అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే గత పదిరోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న షాలిని ఆదివారం మృతిచెందింది. ఢిల్లీకి చెందిన షాలిని గత నెలలోనే అమెరికాకు వచ్చినట్లు ఆమె బంధువులు తెలిపారు. డెంటల్ సర్జరీలో డిగ్రీ పూర్తిచేసిన షాలిని, మాస్టర్ కోసం టెక్సాస్‌లోని యూనివర్సిటీలో చేరింది. ఇటీవల టెక్సాస్‌లో హరికేణ్ హార్వీ కారణంగా భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న షాలిని తన స్నేహితుడు నిఖిల్ భాటియాతో కలిసి స్వమ్మింగ్ చేస్తుండగా, ఆకస్మాత్తుగా వరదలు సంభవించాయి. ఈ వరదల్లో కొట్టుకుపోతున్న షాలిని, నిఖిల్‌ను స్థానిక అధికారులు రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతు ఆగస్టు 30న నిఖిల్ ప్రాణాలు కోల్పోగా, అదివారం షాలిని కన్నుమూసింది. షాలిని గురించి తెలియగానే ఆమె తమ్ముడు, మేనమామ అమెరికా బయల్దేరి వెళ్లారు. షాలిని అంత్యక్రియలు బ్రయన్లో చేయనున్నట్లు కాన్సులేట్ వర్గాలు వెల్లడించాయి.













