భారత విద్యార్థిని అనుమానాస్పద మృతి…
అమెరికాలోని ఇండియానాలో ఓ భారత విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ నెల 21వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ నొట్రే డేమ్ క్యాంపస్ సమీపంలోని లేక్ వద్ద శవమై తేలింది. వివరాల్లోకి వెల్తే.. అన్రోస్ జెర్రీ అనే భారత విద్యార్థిని యూనివర్సిటీ ఆఫ్ నొట్రే డేమ్లో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అయితే గత మంగళవారం నుంచి ఆమె ఉన్నట్టుండి కనిపించకుండా పోయంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు నొట్రే డేమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్రోన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాం క్యాంపస్ సమీపంలోని లేక్ వద్ద కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టు కోసం ఆస్పత్రికి తరలించారు.
అన్రోస్ను ఎవరైనా చంపేసి లేక్‌లో పడేసి ఉంటారా? లేక ఆమెనే ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందిందా? అనే విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. కాగా తన గ్రాడ్యుయేషన్ పూర్తైన వెంటనే డెంటల్ స్టడీస్ చేయాలనేది అన్రోన్ ఆలోచన అని ఆమె బంధువులు తెలిపారు. ఈ ఘటనతో ఆమె స్వస్థలమైన కేరళలో విషాదం నెలకొంది.













