అమెరికాలో పట్టుబడ్డ భారతీయ విద్యార్థి
అమెరికా యూనివర్సిటీలో సీటు పొందేందుకు నకిలీ, తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించిన భారతీయ విద్యార్థి, అనంతరం అతడు సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టుతో అక్కడి పోలీసులకు దొరికిపోయాడు. ఆర్యన్ ఆనంద్ అనే విద్యార్థి పెన్సిల్వేనియాలోని లెహై ప్రైవేట్ యూనివర్సిటీలో 2023- 2024లో సీటు, ఉపకార వేతనం కోసం నకిలీ ధ్రువపత్రాలు ఇవ్వడంతో పాటు తండ్రి చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సమర్పించాడు. అనంతరం నేను నా జీవితాన్ని, కెరీర్ను అబద్ధాలపై నిర్మించుకుంటున్నాను అని తన సామాజిక మాధ్యమ ఖాతాలో పోస్టు చేశాడు. అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టగా, అతడి బాగోతం వెలుగులోకి వచ్చింది.







