కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి కాల్చివేత
కాలిఫోర్నియోలోని ఫ్రెన్స్కో సిటీలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో ధరంప్రీత్ సింగ్ జస్సేర్ (21) అనే భారత విద్యార్థి మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఓ నిత్యావసరాల దుకాణంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నలుగురు దుండగులు వచ్చి పక్కనున్న పెట్రోలు బంకులో దోచుకున్నారు. ఈ దుకాణం లోనూ చోరీ చేయడానికి రావడంతో నగదు కౌంటర్ వెనుక దాక్కొన్నాడు. అయినా అతని కాల్పి చంపి, నగదు దోచుకున్నారు. పంజాబ్‌కు చెందిన జస్సేర్ అకౌంటింగ్ కోర్సు చదవడానికి మూడేళ్ల క్రితం విద్యార్థి వీసాపై అక్కడి వెళ్లాడు. నిందితుల్లో అత్వాల్ (22) అనే భారత మూలాలు ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.













