అత్యాచారాల నుంచి కాపాడే సెన్సర్
అత్యాచారాల నుంచి మహిళలను కాపాడే ఓ వేరబుల్ సెన్సర్ను అమెరికాలోని మసాచుసెట్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఈ పరిశోధనలో భారత పరిశోధకురాలు మనీషా మోహన్ పాలుపంచుకోవడం విశేషం. సకాలంలో సన్నిహితులు, పోలీసులను అప్రమత్తం చేసేందుకు ఈ సెన్సర్ తోడ్పడుతుంది. అచ్చం స్టిక్కర్లానే కనిపిస్తున్న దీన్ని ఎలాంటి వస్త్రాలపైనైనా అంటించొచ్చు. వస్త్రాలు మనం విప్పుకోవడం, ఇతరులు బలవంతంగా విప్పడం మధ్య బేధాలను ఇది గుర్తించగలదు. మహిళలు ప్రతి ఘటించే స్థితిలో లేకపోయినా లేదా అపాస్మారక స్థితిలో ఉన్నా వారిపై జరిగే దాడులు బ్లూటూత్ సాయంతో ఇది స్మార్ట్ఫోన్కు తెలియజేస్తుంది. 30 సెకన్లల్లోగా బాధితురాలు ఈ సందేశంపై స్పందించకపోతే స్మార్ట్ఫోన్ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. పరిసరాల్లోని వారిని అప్రమత్తతం చేయడంతోపాటు పోలీసులకూ సమాచారం అందిస్తుంది.













