సుదర్శన్ పట్నాయక్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు
ప్రఖ్యాత భారతీయ సైకత కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్‌కు అమెరికాలో ప్రఖ్యాత పీపుల్స్ ఛాయిస్ అవార్డు వచ్చింది. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యంపై ఆయన రూపొందించిన సైకత శిల్పం అమెరికన్లను ఆకట్టుకుంది. బోస్టన్‌లో నిర్వహించిన 2019 రివర్ బీచ్ అంతర్జాతీయ సైకతశిల్ప ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 15 మంది అగ్రశ్రేణి సైకత కళాకారులను ఎంపికచేయగా వారిలో సుదర్శన్ పట్నాయక్ ఒరు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపి, సముద్రాలను కాపాడండి అనే సందేశంతో ఆయన సైకతశిల్పం రూపొందించారు. ఇది తనకు చాలా పెద్ద గౌరవమని, ఈ అవార్డు భారతదేశానికే దక్కిందని ఆయన తెలిపారు.













