బ్రిటన్ ఏజీగా భారత సంతతి మహిళ
బ్రిటన్ నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా భారత సంతతి మహిళ సుయెల్లా బ్రేవర్మాన్ (39) లండన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ క్యాబినెట్ పదవికి సుయెల్లాను ప్రధాని బోరిస్ జాన్సన్ ఎంపిక చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవిద్యను అభ్యసించిన ఆమె.. పబ్లిక్ లా, జ్యుడీషియల్ రివ్యూల్లో నిపుణురాలు. చరిత్రాత్మకమైన అటార్నీ జనరల్ పదవిని చేపట్టిన రెండో మహిళగా తనకు అరుదైన గౌరవం లభించిందని, న్యాయ వ్యవస్థలో విశ్వాసాన్ని ప్రోదిచేసేందుకు ప్రాధాన్యమిస్తానని సుయెల్లా చెప్పారు. 2015 నుంచి ఎంపీగా ఉన్న సుయెల్లా.. బ్రెగ్జిట్ విషయంలో బోరిస్‌కు గట్టి మద్దతుదారుగా నిలిచారు.













