భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి
అమెరికాలో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థి ఆలాప్ నర్సీపురా మృతి చెందారు. న్యూయార్క్‌లోని ఫాల్ క్రీక్ ప్రాంతంలో ఆలాప్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భారత సంతతికి చెందిన 20 ఏళ్ల ఆలాప్ న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే ఈనెల 17వ తేదీ నుంచి నర్సీపురా కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఇతాకా ఫాల్స్ సమీపంలోని ఫాల్క్రీక్ వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అది ఆలాప్ మృతదేహాంగా గుర్తించారు. ఆలాప్ మృతిపై ఇప్పటివరకూ ఎలాంటి అనుమానాలు లేవని, కేసు నమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.













