అమెరికా అధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ పోటీ!
భారత సంతతికి చెందిన వారు అమెరికా అధ్యక్ష పదవి పోటీ పడే రోజు ఎప్పుడు వస్తుందో అనేది చాలా మందికి ఆసక్తికరమైన విషయం. 2020 ఎన్నికల్లో సరిగ్గా అది జరిగే అవకావం కనిపిస్తోంది. భారత సంతతికి చెందిన అమెరికా సెనేటర్ కమలా హారిష్ వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేయనని చెప్పడం లేదు. అంటే ఆమె పోటీ చేయవచ్చనే అంచనాలు పెరిగాయి. 53 ఏళ్ల కమల, అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి. ఆమె డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు. 2020లో అధ్యక్ష పదవి పోటీ చసే అవకాశాన్ని ఖండిస్తున్నారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లేదని అని ఆమె జవాబు చెప్పారు. తాను ఖండించడం లేదని సృష్టం చేశారు. తద్వారా, రేసులో తాను ఉన్నానని సంకేతాలిచ్చారు.
ట్రంప్ విధానాల వల్ల నష్టపోతున్న వలసదారులకు ఆమె మద్దతు తెలుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లు ఆమెకు అదనపు బలం కావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వలసవాదులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం తలపెట్టిన మార్పులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆమె గత ఏడాది తన పార్టీ నేతలను కోరారు. 2016లో సెనేట్‌కు ఎన్నిక కాకముందు ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేశారు. అధ్యక్ష పదవికి పోటీచేయాలనే కాంక్ష ఆమెకు బలంగా ఉందని అమెరికాలో ఉహాగానాలున్నాయి. తరచూ ఆమె ఈవిషయంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంటారు. ఒకవేళ ఆమె పోటికి సిద్ధపడితే, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం పొందడమే మొట్టమొదటి సవాలు అవుతుంది.













