అమెరికాలో మరో భారతీయుడి హత్య
అమెరికాలో భారతీయుల వరుస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి. అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటలనను నడుపుకుంటున్న 76 ఏళ్ల ప్రవీణ్ రావూజీభాయ్ పటేలను అద్దె గది కోసం వచ్చిన ఒక కస్టమర్ కాల్చి చంపారు. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరిగిన ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను షెఫీల్డ్ పట్టణ పోలీస్ ఉన్నతాధికారి రిక్కీ టెర్రీ వెల్లడిరచారు. షెఫీల్డ్ పట్టణంలో హిల్ క్రెస్ట్ మోటెల్ పేరుతో ఒక హోటల్‌ను ప్రవీణ్ సొంతంగా నిర్వహిస్తున్నారు. ఈ హోటల్‌కు 35 ఏళ్ల విలియం బెరిమీ మోరే అఏ వ్యక్తి వచ్చి రూమ్ కావాలని ప్రవీణ్‌ను అడిగాడు. కొద్దిసేపటికే విలియం, ప్రమీణ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది. వెంటనే విలియం తన వద్ద ఉన్న గన్‌తో ప్రవీణ్‌ను కాల్చిచంపాడు. అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఇంటో చొరబడేందుకు ప్రయత్నస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు సార్లు తుపాకీ శబ్దం విన్నానని అక్కడే ఉన్న ఒక సాక్షి తెలిపారు. అసలు కారణాలను పోలీసులు వెల్లడిరచలేదు.







