అరుదైన ఘనత సాధించిన భారత మహిళ
భారత సంతతికి చెందిన మహిళ అరుదైన ఘనత సాధించారు. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళ తన ప్రతిభా పాటవాలతో ఉన్నతస్థాయికి చేరారు. పురుషుల ఆధిక్యత అధికంగా ఉండే, వాహన రంగంలో అందునా అగ్రగామి సంస్థ అయిన జనరల్ మోటర్స్ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ)గా ప్రవాస భారతీయురాలు (ఇండియన్-అమెరికన్) దివ్వా సూర్యదేవర (39) నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఫైనాన్స్)గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సీఎఫ్ఓ చక్ స్టీవెన్స్ స్థానాన్ని దివ్వా సూర్యదేవర భర్తీ చేయనున్నారు. సెప్టెంబరు 1న ఆమె సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టనున్నారు. చెన్నైలో పుట్టిన దివ్వా సూర్యదేవర 2017 జులై నుంచి జనరల్ మోటర్స్ వైస్ ప్రెసిడెంగ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జనరల్ మోటార్స్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ) మేరీ బర్రా కూడా మహిళే కావడం విశేషం.













