డెమోక్రటిక్ ప్రైమరీలో ప్రవాస భారతీయుడు విజయం
ఇరాక్, రష్యా, ఇజ్రాయెల్, తైవాన్ లలో దౌత్యవేత్తగా పని చేసిన ప్రెస్టెన్ కులకర్ణి అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన అటార్నీ న్యాంజా డేవీస్ మూరేని ఓడించారు. మూరే పీర్లెండ్ సిట్ కౌన్సిల్ సభ్యునిగా పని చేశారు. ఆయనను కులకర్ణి పార్టీ ఎన్నికల్లో ఓడించినట్టు పార్టీ ప్రకటించింది. ప్రవాస భారతీయుడైన కులకర్ణి టెక్సాస్‌లో జరిగిన 22వ జిల్లా మహాసభలో టెక్సాస్ ప్రైమరీ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థితో పోటీ పడనున్నారు. కులకర్ణి భారత దేశానికి చెందిన విద్యావేత్త. నవలారచయిత కుమారుడు. కులకర్ణి తండ్రి 1969లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు.













