గ్రీన్ కార్డులకు కోటా వద్దు
గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కేటాయించిన కోటాను రద్దు చేసి, వీటి కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వారికి మంజూరు చేయాలని ఇండియన్ అమెరికన్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గత వారాంతంలో న్యూజెర్సీ, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. గ్రీన్‌కార్డుల జారీకి కోటాను ఎత్తివేయాలి. 3 లక్షల మంది 90 ఏళ్లపాటు వేచి చూడాలా? మేము ఏం తప్పు చేశాం? అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ విషయంపై ఆమెరికా కాంగ్రెస్, సెనేట్, వైట్‌హౌస్ దృష్టిపెట్టి, నిపుణులైన ఇమ్మిగ్రేంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నిరసనకారులు కోరారు.













