భారత టెకీలకు అమెరికా షాక్
భారతీయ టెకీలకు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్1 బీ వీసాల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 25 శాతం దరఖాస్తులను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది. అక్టోబరు నుంచి జూన్ వరకు (మూడు త్రైమాసికాల్లో) ఈ మొత్తం దరఖాస్తులను తిరస్కరించారు. వీటిలో అత్యధికంగా కాగ్నిజెంట్ (60 శాతం) కంపెనీవి కాగా క్యాప్జెమిని, యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 2015 (6 శాతం)తో పోలిస్తే 2019 (25 శాతం)లో తిరస్కరణ రేటు 3 రెట్లు పెరిగిందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తెలిపింది. యూఎస్ సీఐఎస్ అక్టోబరు నుంచి సెప్టెంబరు ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తుంది. హెచ్1బీ వీసా హోల్డర్లలో భారతీయులు 70 శాతం మంది ఉన్నారు. తర్వాతి స్థానంలో చైనా ఉంది.













