ఐఎఫ్ఏ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ మేళాకు ముహూర్తం ఖరారు

ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా (ఐఎఫ్ఏ) ఆధ్వర్యంలో అమెరికాలోని జార్జియాలో ఐఎఫ్ఏ ఫ్రీడమ్ మేళా 2023 జరగనుంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యాలైన యూఎస్ఏ, భారత్ రెండు దేశాల స్వతంత్ర దినోత్సవాలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది వరుసగా ఎనిమిదోసారి ఈ మేళాను నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాత జరుగుతున్న ఈ మేళా మరింత భారీగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని ప్రతి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే విధంగా గ్రాండ్ పరేడ్ జరుగుతుంది. ఈ నెల 19వ తేదీన జరిగే ఈ ఐఎఫ్ఏ ఫ్రీడమ్ మేళాలో కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొనాలంటే https://tinyurl.com/IFAFM2023Cultural రిజిస్టర్ చేసుకోవాలి. పరేడ్ కోసం https://tinyurl.com/IFAFM2023Parade లింకులో, వెండార్ స్టాల్స్ కోసం https://tinyurl.com/IFAFM2023VendorStalls లింకులో, వాలంటరీర్ సభ్యత్వం కోసం https://tinyurl.com/IFAFM2023Volunteers లింకులో రిజిస్టర్ చేసుకోవాలని ఐఎఫ్ఏ తెలిపింది.