మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థాన్ మద్దతుదారులు.. తరుణ్ జీత్ ను
అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. సిక్కుల గురుపూర్ణిమ సందర్భంగా న్యూయార్క్‌లోని హిక్స్విల్ గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరుణ్‌జీత్ సింగ్ సంధూను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై, మరో ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్యకు జరుగుతున్న కుట్రపై ప్రశ్నలు సంధిస్తూ సంధూపైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. గురుద్వారాలోని మెజారిటీ సిక్కులు వారిని అడ్డుకుంటూ తరుణ్ జీత్ చుట్టూ కవచంగా ఏర్పడి ఆయన్ను సురక్షితంగా బయటికి పంపారు. హిక్స్విల్ గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకు తరుణ్‌జీత్ అక్కడికి వెళ్లారు. సిక్కు సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఖలిస్థానీ మద్దతుదారుల అరాచకాలు పెరుగుతున్నాయి.













