విద్యార్థులను కలిసేందుకు అనుమతి లభించింది
పే టు స్టే కుంభకోణంలో అమెరికా అదుపులో ఉన్న 129 మంది భారతీయ విద్యార్థుల్లో 117 మందిని మన దేశ దౌత్య అధికారులు కలిసేందుకు అనుమతి లభించిందని కేంద్రం వెల్లడించింది. భారతీయ విద్యార్థుల డిటెన్షన్పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్స్ అధికారులు అమెరికా వ్యాప్తంగా 37 డిటెన్షన్ సెంటర్లను సందర్శించి ఇప్పటివరకు 117 మంది విద్యార్థులను కలిసిందుకు అనుమతి పొందారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన 12 మందిని కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.













