ట్రంప్ ప్రభుత్వంలో భారతీయులకు పెద్దపీట
ఇప్పటివరకు అనేకమంది అమెరికా అధ్యక్షులు అమెరికాలో భారతీయుల ప్రతిభను గుర్తించి వారికి తగ్గ ప్రభుత్వ పదవులను ఇచ్చారు. అయితే గడిచిన నాలుగు సంవత్సరాలలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రభుత్వంలో పలువురు భారతీయులను నియమించుకున్నారు. ఈ సంఖ్య గతంలో కన్నా ఎక్కువగా ఉండటం విశేషం.
కమలాహారీస్, నిక్కిహేలీ, అజిత్‌పాయ్, నీమిరావు, సీమా వర్మ, నీల్ ఛటర్జీలాంటి ఎంతోమందిని ట్రంప్ తన ప్రభుత్వంలో కీలకమైన పదవులను?ఇచ్చారు. విదేశీ, న్యాయ, ఆర్థిక, ఆరోగ్యశాఖల్లో భారతీయులకు స్థానం కల్పించారు. ఇందులో కొందరు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ట్రంప్ వారి అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి వారికి పదవులిచ్చి, ఇండియాకి మిత్రుడిని అని చాటుకున్నాడు.
నిక్కీహేలీ – యునైటెడ్ నేషన్స్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు.
అజిత్ పాయ్ – ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చీఫ్
సీమ వర్మ – హెడ్, సెంటర్ ఫర్ మెడికేర్ అండ్ మెడికల్ ఎయిడ్ సర్వీసెస్
నీల్ ఛటర్జీ – చైర్పర్సన్, ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్
రాజీవ్ మోతూర్ – హెడ్, ఐటీ డివిజన్, సోషియల్ సెక్యూరిటీ ఆఫీసర్
రాజ్షా – డిప్యూటీ వైట్‌హౌస్, ప్రెస్ సెక్రటరీ
ఉత్తమ్ థిల్లాన్ – ఇంటర్‌పోల్ వాషింగ్టన్ డైరెక్టర్
అనురాగ్ సింఘాల్ – ఫ్లోరిడా ఫెడరల్ జడ్జ్
అముల్ థాపర్ – యుఎస్ సర్క్యూట్కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో న్యాయమూర్తి
నియోమి రావు – యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ డిసి సర్క్యూట్
జడ్జ్ థాపర్ – ఫస్ట్ ఇండియన్ అమెరికన్ జస్టిస్ – సుప్రీంకోర్టు
గత నాలుగేళ్ళలో ట్రంప్ భారత కమ్యూనిటీని ఆకట్టుకునే అనేక చర్యలు చేపట్టడంతోపాటు హౌడీ మోదీ పేరుతో హ్యూస్టన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, అహ్మదాబాద్‌లో మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భారతీయులకు దగ్గరయ్యారు.
ట్రంప్ అమెరికాలోని అన్నీ మైనారిటీ వర్గాలకు (భారతీయులతో సహా) విద్యకోసం, మతపరమైన కార్యక్రమాలకోసం దాదాపు 250 మిలియన్లకు పైగా నిధులను మంజూరు చేశారు. ఈ విధంగా ఆ వర్గాలకు మద్దతుగా నిలిచారు. ట్రంప్ ఎప్పుడూ అమెరికా లవ్స్ ఇండియా అంటూ ఉంటారు. భారత కమ్యూనిటీకి ఎక్కువ పదవులు ఇవ్వడం ద్వారా ట్రంప్ భారత కమ్యూనిటీకి బాగా దగ్గరయ్యారు.













