భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్‌హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్డిల్ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు.













