విద్యార్థుల్ని కాపాడిన ఇండియన్ టీచర్
అమెరికాలోని ఫ్లోరిడా స్కూల్లో ఈ నెల 14వ తేదీన ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిదే. డగ్లస్ స్కూల్లో ఆ మారణహోమం జరిగింది. అయితే ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతి టీచర్ శాంతి విశ్వనాథన్ అనేక మంది విద్యార్థులను కాపాడారు. ఉన్మాది కాల్పులు జరుపుతున్న సమయంలో ఆమె సమయస్ఫూర్తి ప్రదర్శించిన తన క్లాస్రూమ్ విద్యార్థులను రక్షించారు. స్కూల్లో రెండవ సారి అలారమ్ వినబడగానే టీచర్ శాంతి అలర్ట్ అయ్యారు. తన క్లాస్‌రూమ్‌లో ఉన్న విద్యార్థులను వెంటనే నేలపై పడుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత వెంటవెంటనే తలుపులు, ఆ రూమ్‌కు ఉన్న కిటీకీలను మూసివేశారు. మరోవైపు ఉన్మాది నికోలస్ స్కూల్లో రక్తపాతం సృష్టించాడు. అయితే స్వాట్ టీమ్ పోలీసులు వచ్చిన తర్వాత కూడా టీచర్ శాంతి తన క్లాస్రూమ్ తలుపులు తెరిచేందుకు నిరాకరించింది. ఉన్మాది నికోలస్ తన క్లాస్‌రూమ్‌లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడేమో అన్న ఉద్దేశంతో ఆమె తలుపులు తీయలేదు. అయితే స్వాట్ పోలీసులు ఆ తర్వాత డోర్లను ధ్వంసం చేసి విద్యార్థులను ఆధీనంలోకి తీసుకున్నారు. టీచర్ శాంతి విశ్వనాథన్ సమయస్ఫూర్తి వల్ల అనేక మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.













