ఇండో అమెరికన్ కు అరుదైన గౌరవం
ఇండో అమెరికన్ కాంగ్రెస్ నేత రో ఖన్నాకు అరుదైన గౌరవం దక్కింది. ఓపెనింగ్ ఆఫ్ అమెరికా అగేన్ కాంగ్రెషనల్ గ్రూపు లో ఖన్నాను సభ్యుడిగా నియమిస్తున్నట్టు అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గురువారం గ్రూపులోని సభ్యుల పేర్లను ట్రంప్ బహిర్గతం చేశారు. ఇందులో భారత సంతతికి చెందిన డెమోక్రాట్ రోఖన్నా ఒకరు మాత్రమే ఉన్నాడు. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక వ్వవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు గవర్నర్లకు మార్గదర్శకాలు త్వరలో ట్రంప్ అందజేస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఖన్నా మాట్లాడు అమెరికా ప్రజలకు ఫెడరల్ ప్రభుత్వం నుంచి మద్దతు, మార్గదర్శకత్వం, సాయం అవసరమన్నారు. చిన్న తరహా వ్యాపార వర్గాలను ఆదుకుంటామని, మళ్లీ గాడినపెడ్తామని తెలిపారు. ప్రతీ వారం కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖన్నా కాలిపోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పలువురు డెమోక్రట్లతో కలిసి ట్రంప్ సూచించిన బాధ్యతలు నిర్వర్తిస్తామని వివరించారు. కరోనా వైరస్ సలహా సంఘంలో తనను ఓ సభ్యుడిగా ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓ సభ్యుడిగా ప్రతీ అమెరికన్‌కు అండగా నిలబడ్తానని భరోసా ఇచ్చారు. చైనా, జర్మనీపై కీలకమైన మెడికల్ ఎక్విప్మెంట్లపై అమెరికా ఆధారపడుతుందని, పునర్ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వివరించాడు.













