నాసా వ్యోమగామి అభ్యర్థిగా రాజాచారి
భారతీయ సంతతికి చెందిన కల్నల్ రాజాచారిని అమెరికాలోని నేషనల్ ఎయిరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వ్యోమగామిగా ఎంపిక చేసింది. 18000 మంది అభ్యర్థులనుంచి నాసా మొత్తం 12 మంది వ్యోమగాములను ఎంపిక చేస్తే అందులో రాజాచారి ఒకరు. వాటర్లూలోని లోవా ప్రాంతానికి చెందిన రాజాచారి ఎయిరోనాటిక్స్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. యుఎస్ నావల్ టెస్ట్ ఫైలెట్ స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. లెఫ్ట్‌నెంట్ కల్నర్ రాజా గ్రైండర్ చారి(39) 461వ ఫ్టైల్ టెస్ట్ స్క్వాడ్రన్గాను, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ జేస్ ఎఫ్ 35వ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ఫోర్స్కు డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వహించారు.













