అగ్రరాజ్యంలో పెరిగిన ఇండియన్ అమెరికన్స్
అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల జనాభా 2010-17 మధ్య 38 శాతం మేర పెరిగినట్లు సౌత్ ఏషియా అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) అనే సంస్థ అంచనా వేసింది. 2010లో వీరి జనాభా 31,83,063గా ఉండగా, 2017 నాటికి అది 44,02,363కి పెరిగినట్లు తెలిపింది. అలాగే కనీసం 6,50,000 మంది అక్రమంగా ఉంటున్నట్లు తెలిపింది. 2010తో పోలిస్తే ఈ సంఖ్య 76 శాతం పెరిగిందని వివరించింది. అమెరికాలో దక్షిణాసియా మూలాలున్న వారి జనాభా 40 శాతం పెరిగినట్లు సాల్ట్ అంచానావేసింది. అత్యధికంగా నేపాలీల జనాభా 206 శాతం పెరుగగా, ఆ తర్వాతి స్థానాల్లో భారతీయులు (38 శాతం), భూటానీలు(38 శాతం), పాకిస్థానీలు (33 శాతం), బంగ్లాదేశీయులు (26 శాతం), సింహళీయులు (15 శాతం) ఉన్నారు.













