యూఎస్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ప్రవాస భారతీయురాలు
భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా న్యాయవాది మనీషా సింగ్(45) యూఎస్ విదేశాంగ శాఖలోని ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ పదవిలోకి వచ్చిన తొలి మహిళగా ఆమె ఆరుదైన గౌరవంగా దక్కించుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన మనీషా, ఉన్నత చదువుల కోసం ఫ్లోరిడాకు వచ్చారు. ఆమె కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం ఇక్కడే స్థిరపడిపోయారు. రాజకీయాల్లోకి ప్రవేశించకముందే ఆమె న్యాయవాదిగా పనిచేశారు. అమెరికా విదేశాంగ శాఖలో బాధ్యతలు నిర్వరిస్తున్న అత్యున్నత స్థాయి భారత సంతతి అధికారికగా ఎంపికయ్యారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అమెరికా ఆర్థికపరమైన దౌత్యవ్యవహారాలను ఆమె పర్యవేక్షించనున్నారు.













