వైట్ హౌస్ జర్నలిస్టుగా భారత సంతతి మహిళ
వైట్‌హౌస్ కరెస్పాండెంట్ అసోసియేషన్‌కు (డబ్ల్యుహెచ్‌సిఎ) భారతసంతతికి చెందిన మొదటి మహిళ అనితా కుమార్ ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడి సమచారాన్ని రాసే వందేళ్ల చరిత్ర ఉన్న ఉన్నత పాత్రికేయుల విభాగానికి పోటీలేకుండా డబ్ల్యుహెచ్సిఎకు అనితా ఎన్నికైనారు. ఆమె వైట్‌హౌస్ వార్తలను 2012 నుండి కవర్ చేస్తున్నారు. చెర్లోట్టెస్విల్లెలో పుట్టిన అనితాకుమార్ వర్జీనియా యూనివర్సిటీలో చదివారు. అక్కడ నుంచి లించ్‌బర్గ్‌లో వార్తలను రాస్తూ తన కెరీర్‌ను ప్రారంభించారు. వర్జీనియా, ఉత్తర కరోలినాలోని గ్రీన్స్బొరోలో ఆమె వార్తలు ప్రసారమైనాయి. సెంట్ పీటర్బర్గ్, ద టాంపా బే టైమ్స్ లు ఆమె ప్రధాన సంస్థలు. యూఎస్ కాపిటల్కు వచ్చేముందు అమె అక్కడ పదేళ్లు పనిచేశారు. కుమార్ ప్రస్తుతం మెక్‌క్లాచీ దినపత్రికలో గ్రూప్‌లో వైట్‌హౌస్ కరస్పాండెంటెంట్గా పని చేయాలి.













