వారి స్వేచ్ఛ కోసమే ఈ తీర్మానం : ప్రమీలా జైపాల్
జమ్మూ -కశ్మీరులో సామూహిక నిర్బంధాలు, కమ్మూనికేషన్లపై ఆంక్షలను ఎత్తివేయాలని భారత సంతతికి చెందిన డెమోక్రాట్ చట్టసభ్యురాలు ప్రమీలా జైపాల్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఆమె అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆమె మాట్లాడుతూ తాను బైపార్టిజాన్ హౌస్ రిజల్యూషన్‌కు ప్రవేశపెట్టానని చెప్పారు. జమ్మూ-కశ్మీరులో సాధ్యమైనంత త్వరగా కమ్యూనికేషన్లపైనా, సామూహిక నిర్బంధాలపైనా ఆంక్షలను తొలగించాలని కోరారు. అక్కడ నివసించేవారందరి మత స్వేచ్ఛను కాపాడాలన్నారు. దీనిపై శశి థరూర్ స్పందిస్తూ, అమెరికా ప్రతినిధుల చర్య ప్రశంసనీయం. మా పార్లమెంటులో యావత్తు శీతాకాలం సమావేశాల్లో కశ్మీరు అంశం పై కనీసం చర్చించలేకపోయాం. సిగ్గుచేటు అని పేర్కొన్నారు.













