న్యూయార్క్ సివిల్ కోర్టు న్యాయమూర్తిగా దీప అంబేద్కర్
న్యూయార్క్ సిటీ సివిల్ కోర్టు తాత్కాలిక మధ్యంతర న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన దీప అంబేద్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయం ప్రకటించింది. ఈ బాధ్యతలు స్వీకరించిన రెండో భారత సంతతి మహిళ దీప. అంతకుముందు దీప క్రిమినల్ కోర్టులో బాధ్యతలు నిర్వహించారు. 2015లో రాజ రాజేశ్వరి క్రిమినల్ కోర్టు న్యాయాధిపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యూయార్క్ నగర న్యాయమూర్తిగా నియమితులైన మొట్టమొదటి భారతీయ మహిళగా పేరుపొందారు. నేడు విడుదల చేసిన ప్రకటనలో న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డి. బ్లాసియో కార్యాలయం దీప నియామకంతోపాటు మరో ముగ్గురు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తులుగా ప్రకటించింది. దీప అంబేద్కర్ న్యూయ్కార్ సిటీ కౌన్సిల్లో మూడు సంవత్సరాలు సీనియర్ అటార్నీగా, ప్రజా భద్రత కమిటీకి సలహాదారుగా పనిచేశారు. మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి ఆమె న్యాయశాస్త్ర పట్టా పొందారు.













