అట్టహాసంగా మెంఫిస్ ఇండియా ఫెస్ట్!
మెంఫిస్ పట్టణంలో ఇండియా అసోసియేషన్ అఫ్ మెంఫిస్ ఆధ్వర్యంలో ఇండియా ఫెస్ట్ 2019 అట్టహాసంగా ఆద్యంతం విభిన్నమయిన సాంస్కృతిక ప్రదర్శనలతో దాదాపు పది వేలకు పైగా హాజరైన ప్రేక్షకుల్ని అలరించింది. మెంఫిస్ అగ్రిసెంటెర్ ఇంటర్నేషనల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ ఉత్సవంలో ఇండియన్ బాలే థియేటర్ అష్ట లక్ష్ముల్నీ కీర్తిస్తూ సాగె అఖిలాండేశ్వరి చాముండేశ్వరి కూచిపూడి నృత్యాన్ని అత్యద్భుతంగా కన్నుల పండువుగా ప్రదర్శించారు. ప్రముఖ నృత్య కళాకారిణి శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి నృత్య దర్సకత్వంలో సహస్ర ససిపల్లి, శాన్వి కుంటమల్ల, నిధి నిహారిక చెన్నం, అమృత గరుడాద్రి, సాత్విక సెంథిల్ కుమార్, రిత్విక సెంథిల్ కుమార్, శ్రీమతి చంద్ర ప్రభ మరియు డాక్టర్ రమణ వాసిలి శక్తి స్వరూపాలైన పార్వతి దేవి, మహా లక్ష్మి, సరస్వతి దేవి మరియు మహా కాళి అంశాల్ని ఆవిష్కరించారు.
ఈ నృత్య ప్రదర్శనకు గాను గ్రాఫిక్స్ మరియు వీడియో శ్రీ రత్నాకర్ వాన, శ్రీ శ్రవణ్ మాలి మరియు శ్రీ రాజశేఖర్ చెన్నం సమకూర్చారు. స్పిరిట్యుయల్ ఫౌండేషన్ అఫ్ అమెరికా, ఆర్ట్స్ మెంఫిస్ మరియు టేనస్సీ ఆర్ట్స్ కమిషన్ ప్రత్యేక ఆర్ధిక సహాయం అందించారు.
Dr. Ramana Vasili
901-387-9646
Spiritual Foundation, Inc.
ramanavvasili@hotmail.com













