27న భారత్, అమెరికా చర్చలు
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమైన లక్ష్యంగా భారత్, అమరికాల మధ్య 2+2 మంత్రిత్వ స్థాయి చర్చలు అక్టోబర్ 27న జరగనున్నాయి. అంతర్జాతీయ సంబంధాలు, రక్షణ, భద్రత.. తదితర రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. చర్చల్లో భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. అమెరికా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్సర్ పాల్గొంటారు. ఎస్పర్ అక్టోబర్ 26న భారత్‌కు వస్తున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ఈ మంత్రిత్వ స్థాయి చర్చలు జరగడం ఇది మూడోసారి కానుంది. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చైనా విస్తరణవాద కాంక్ష దుష్పలితాలు తదితర అంశాలు ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.













