శ్రీ అట్లూరికి ఇండియా స్టార్టప్ ఫెస్ట్-2023 జీవితసాఫల్య పురస్కారం
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్ యుగం నడుస్తోంది. ఈ క్రమంలో స్టార్టప్లకు ఎంతో సహకారం అందించిన శ్రీ అట్లూరిని ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ సన్మానించింది. ఈ సంస్థ నేతృత్వంలో ఇండియా స్టార్టప్ ఫెస్ట్-2023 (ఐఎస్ఎఫ్ 2023) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఐఎఫ్ఎస్-2023 వేదికపై అట్లూరికి జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయడం జరిగింది. ఈ అవార్డు అందుకున్నందుకు ఎంతో సంతోసంగా ఉందన్న అట్లూరి.. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మార్గదర్శనం చేసిన జేఏ చౌదరిగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు అందుకున్న అట్లూరికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.













